దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలి : సూది కొండ విజ్ఞప్తి
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఒకనాడు ఎంతో వైభవంగా కలకల్లాడిన దర్జీ టైలరింగ్ వృత్తి నేడు రెడీమేడ్ వ్యాపారాల తాకిడి వలన దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితులలో ఉందని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు.ఈరోజు ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా అయన అనకాపల్లి పట్టణంలో పలువురు దర్జీలను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ గతంలో ప్రజలు ఎక్కువగా తమ దుస్తుల కోసం దర్జీలు మీద ఆధార పడే వారిని అయితే ప్రస్తుతం రెడీమేడ్ వస్త్రాల వినియోగం ఎక్కువ కావడం తో దర్జీలకు ఉపాధి కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలోతరతరాలుగా దశాబ్దాల కాలంగా టైలరింగ్ వృత్తి నే తమ జీవనోపాధిగా భావించి చాలీచాలని సంపాదనతో ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన దుస్తుల తయారీ వంటి పనులను దర్జీలకు అప్పగించి వారికి కొంత ఆర్థిక సహకారము ప్రభుత్వం అందించాలని నిరుపేద దర్జీలకు అవసరమైన పరికరాలను సబ్సిడీ ధరలకు అందించాలని నిరుపేద దర్జీలకు ఆర్థిక సహాయం అందించాలని ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేపట్టి కాలనీలు ఏర్పాటు చేయాలని మాణిక్యాలరావు తెలిపారు.//


