జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం పెద్ద ఏడ్ది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి, వంటల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు పెట్టాలని ఉపాధ్యా యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మారుతి, ఎంఈఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.




