Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్ , పరకాల డివిజినల్ పంచాయతీ అధికారి రవిబాబు మండలములోని ప్రగతి సింగారం రైతు వేదికలో కొత్తగా ఏన్నుకోబడిన వార్డు మెంబర్ లకి జరుగుతున్న శిక్షణ కార్యక్రమనికి వారు పర్యవేక్షించారు. ఈ శిబిరంలో పంచాయతీ నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రభుత్వ పతకాల అమలు, డిజిటల్ పాలనా అంశాలపై అవగాహన శిక్షణ ను వారు పర్యవేక్షించారు.అలాగే మైలారం గ్రామములో పల్లె ప్రకృతి వనం, నర్సరి ని జిల్లా పంచాయతీ అధికారి సందర్శించి వారు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామపంచాయతీలో పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రతి ఏటా లక్ష్యానికి అనుకూలంగా మొక్కలు నాటడంతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ స్థలాలు ఈ కార్యాలయంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మొక్కల సంరక్షణ లో అందరూ భాగస్వాములు అవ్వాలి అన్నారు.ఈ కార్యాక్రమములో మండల పంచాయతీ అధికారి బుర్ర రంజిత్ కుమార్ , శిక్షణ ఇస్తున్న టి.ఓ.టి రాయకంటి రాజు,సునిల్,వలస తిరుపతి, వెల్పుల సంతోశ్ పంచాయతీ కార్యాదర్శులు సిబ్బంది పాల్గొన్నారు……