జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సివి రామన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ రవికుమార్ ఉపాధ్యాయులు ఆధ్యాపకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ సైన్స్ ని అభివృద్ధి చేయడానికి సి.వి.రామన్ ఎంతో కృషి చేశారని ఆయన కనిపెట్టిన అంశాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మిత్రులందరికీ ఆదర్శంగా తీసుకొని నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలి అని అన్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అనేక సాంకేతికపరమైన యంత్రాలను తయారు చేసి వాటి పనితీరును ప్రదర్శన నిర్వహించారు, ప్రిన్సిపల్ రవికుమార్ ప్రారంభించిన ప్రదర్శన అందరినిఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏటీపీ సంతోష్, సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


