Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటనమస్) బిచ్కుందలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్ గారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం నకు మూలపురుషుడు సి. వి. రామన్ ఆయన సేవలను కొనియాడారు. రామన్ ఎఫెక్ట్ భారత సైన్స్ ప్రపంచంలో ఒక గొప్ప మైలురాయి అని తెలిపారు. వర్తమాన కాలంలో విజ్ఞానశాస్త్రం ప్రాధాన్యత పెరిగిందని వివరించారు. ప్రశ్నించే తత్వం నుండి సైన్స్ అభివృద్ధి చెందుతుందని అందుకే విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవరుచు కోవాలని సూచించారు. మానవ జీవన వికాసానికి సైన్స్ పరిశోధనలు దోహదం చేస్తాయని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి వెంకటేశం, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ బాబు, పీజీ కోఆర్డినేటర్ టి సంతోష్, బోటనీ విభాగాధిపతి డాక్టర్ ఏ రఘునాథ్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి.అశోక్ రావు , కామర్స్ అధ్యాపకులు డాక్టర్ వై సంజీవరెడ్డి అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు