జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955
నియోజకవర్గంలోని రోడ్ల సమస్యని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను : ప్రత్తిపాటి.
ప్రాధాన్యతాక్రమంలో ప్రభుత్వం రోడ్ల సమస్యను పరిష్కరిస్తుంది : ప్రత్తిపాటి.
నియోజకవర్గంలోని అన్నిప్రధాన, ఇతర ఆర్ బీ రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించానని, ప్రాధాన్యతాక్రమంలో ప్రభుత్వం త్వరలోనే రోడ్లసమస్యను పరిష్కరిస్తుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.రూరల్ మండలం కట్టుబడివారిపాలెం, నాదెండ్ల మండలంలో సాతులూరు గ్రామలలో రూ.8.40 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మత్తుల పనులకు శంకుస్థాపన చేశారు. యూటీ నుంచి కట్టుబడివారి పాలెం (కమ్మవారి పాలెం మీదుగా), వేలూరు – గణపవరం రోడ్డుకు 4కోట్ల రూపాయల నిధులతో అలానే సాతులూరు గ్రామం నుండి దింతెనపాడు గ్రామం వరకు 4.40 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల మరమ్మతులకు శనివారం ప్రత్తిపాటి కూటమినాయకులతో పనులు ప్రారంభించారు.. అనంతరం ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలమే నియోజకవర్గంలోని రోడ్ల సమస్యను మొన్ననే అసెంబ్లీ ద్వారా ప్రభుత్వానికి తెలియచేశానని, రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని ప్రత్తిపాటి చెప్పారు. చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే అన్నిరోడ్లను అభివృద్ధి చేయాలని కోరానన్నారు. నరసరావుపేట రోడ్డు విస్తరణ అంశం కూడా ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు.యూటీ నుంచి చిలకలూరిపేట ఆర్ బీ రోడ్డు మరమ్మతు పనుల్ని రూ.4కోట్లతో చేపట్టామని, ఈ రోడ్డు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రత్తిపాటి తెలిపారు. ఈ రోడ్డును 3 నెలల్లో పూర్తిచేయాలని గుత్తేదారులకు స్పష్టంగా చెప్పామని ప్రత్తిపాటి చెప్పారు. రోడ్లు బాగుపడితే భూముల ధరలు కూడా పెరుగుతాయన్నారు.
ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ల సంకల్పమని, కూటమిప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటే అన్నివర్గాలకు తప్పకుండా మేలు జరుగుతుందన్నారు.కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి జాకోబు రాజు, గ్రామ నాయకులు చెంగంశెట్టి సాంబశివరావు, ముత్యాల రామారావు, ముత్యాల వీరాంజనేయులు, చెన్నంశెట్టి నాగంజనేయులు, వజ్జ సింగయ్య, దగ్గుమల్లి వెంకటేశ్వర్లు, గుర్రం స్వాములు, వేముల నాగేశ్వరరావు, నాతని రాఘవయ్య, సాతులూరు గ్రామ నాయకులు, ఆర్ బి డి.ఈ వి నరేంద్ర రెడ్డి, అధికారులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


