

జనం న్యూస్,ఫిబ్రవరి 10, కౌటాల:- మండలంలోని పార్డి గ్రామానికి చెందిన చాప్లే శ్యాoరావ్ ఈ నెల 7న ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళాడు. ఈ క్రమంలో సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి చేరగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 2 తులాల బంగారు చైను దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి ఈ నెల 8 న కౌటాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా అదే గ్రామానికి చెందిన దుర్గం నాగేంద్ర దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెళ్ళడైంది. అతని వద్ద నుంచి సొమ్మును రికవరీ చేసి బాధితునీకి అప్పగించడం జరిగిందనీ, చోరికి పాల్పడిన దుర్గం నాగేంద్ర పై సోమవారం కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు.