Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955

సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేట మున్సిపాలిటీ గ్రేడ్ వన్ స్థాయి నుండి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా స్థాయి పెరగటం అభినందనీయమని, ప్రజలకు ఆ మేరకు సౌకర్యాలను మెరుగుపరచాలని సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ కోరారు. చిలకలూరిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంత గానో ఉంది అని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయినట్లయితే సాధారణ పోలీసులకు పని ఒత్తిడి తగ్గుతుందని భాను ప్రసాద్ అన్నారు. అంతేకాకుండా కదాదాపు 70 మంది పూర్తిస్థాయి సిబ్బంది కేటాయింపు జరిగి ట్రాఫిక్ ను నియంత్రించగలుగుతారని అన్నారు. తగినంత సిబ్బంది ఉంటే విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, జవాబుబీదారితనం పెరుగుతుందని, తద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టగలుగుతారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మన చుట్టూ కొందరు ఆకతాయిలు వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా యథేచ్ఛగా రోడ్లమీద సంచరిస్తూ అధికారులకు సవాళ్లు విసురుతున్నారని అన్నారు. అటువంటి వారి పట్ల కఠిన వైఖరి అవలంబించాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులకు కనీసం ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దాదాపు లక్షన్నర పైగా ద్విచక్ర వాహనాలు, 40 వేలకు పైగా కార్లు రోడ్లపై తిరగాడుతున్నా, నిర్దేశించిన పార్కింగ్ ప్లేస్ మచ్చుకు ఒకటైన లేకపోవడం విచారకరమని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా కృషిచేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.