జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955
2025 భాగస్వామ్య సదస్సు నందు ఎం ఒ యు చేసుకొని పల్నాడు జిల్లాలో తమపరిశ్రమలను ప్రారంభించేందుకు ముందుకొచ్చిన కృష్ణ ఆగ్రో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం సిమెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ దాచేపల్లి మరియు ఇందన ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ మరియు మెగా ప్రాజెక్టుల స్థాపన వేగవంతం చేసేందుకు గాను వారికున్న సమస్యల పరిష్కారానికి గాను జిల్లా పరిశ్రమల శాఖ, ఎపి ఐ ఐసి, రెవెన్యూ మరియు సంబంధిత అధికారుల తో శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా .ఈ సందర్భంగా సంబంధిత జిల్లా అధికారులకు వారి సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలని తగు ఆదేశాలు ఇచ్చారు . అదే విధంగా జిల్లాలోని ప్రతినియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఎం ఎస్ ఎం ఇ పార్కుల అభివృద్ధి పనులు మరియు ఇంకనూ భూసేకరణ చేయవలసివున్న నియోజకవర్గాలలో భూమి ఎంపిక తదితర విషయాలపై ఎపి ఐ ఐ సి మరియు రెవెన్యూ అధికారులతో చర్చించడం జరిగింది .


