జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955
చిలకలూరిపేట:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సాధారణంగా నెలకు ఒకటో తేదీన పంపిణీ చేసే ఈ కార్యక్రమం, ఈసారి ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యవేక్షణ పట్టణంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి సక్రమంగా అందజేస్తున్నారా లేదా అని ఆయన స్వయంగా పరిశీలించారు. నగదు పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకూడదని, వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.37వ వార్డులో స్వయంగా పంపిణీ పట్టణంలోని పండరీపురం ఏరియాలో పర్యటించిన కమిషనర్, అక్కడ జరుగుతున్న పంపిణీని పరిశీలించారు. 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమారితో కలిసి ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. అర్హులైన లబ్ధిదారులకు కమిషనర్ తన చేతుల మీదుగా పెన్షన్ నగదును అందజేశారు ముందస్తు పంపిణీపై లబ్ధిదారుల హర్షం సకాలంలో, పైగా సెలవు దినం కంటే ముందే పెన్షన్ అందడం పట్ల పట్టణ ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డు కౌన్సిలర్ శివకుమారి మాట్లాడుతూ, కమిషనర్ స్వయంగా పర్యవేక్షించడం వల్ల పంపిణీ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు.


