Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు 23,02,668 విలువ గల రూపాయల చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే అనేక ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోందని ఆయన తెలిపారు పేద కుటుంబాలకు అండగా నిలిచి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ చేరువ కావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో కూడా పాల్గొని వార్డు సభ్యులకు తగు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శాయంపేట మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ పత్తిపాక గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి వరదరాజు పత్తి పాక గ్రామ మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు….