

జనం న్యూస్,ఫిబ్రవరి 11, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి:- లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరికాలని ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరికాలని ఆధ్వర్యంలో కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు క్లబ్ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి సహకారంతో పరీక్ష సామాగ్రి మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వివరాలతో కూడిన చాట్ ను పంపిణీ చేయడం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ మొలుమురి శ్రీనివాస్ మరియు గంట వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. పాఠాలను కేవలం చదవడం కాకుండా దాని యొక్క భావాన్ని , సారాంశాన్ని అర్థం చేసుకుంటే పరీక్షలు రాయడానికి సులువుగా ఉంటుంది.అలాగే జీవితంలో పరీక్ష ఫలితాలు వాటి ర్యాంక్ లు ముఖ్యం కాదు. మనం తీసుకునే నిర్ణయాలె మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. కలంతో మీ కలలను సహకారం చేసుకొవలని కోరుతూ పరీక్షల్లో పది పాయింట్లు సాధించిన వారికి లయన్స్ క్లబ్ తరఫున నగదు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని తెలిపారు. అనంతరం క్లబ్ డైరెక్టర్ ,ప్రకృతి వైద్య, యోగా నిపుణురాలు డాక్టర్ శరణ్య యాదవ్ మాట్లాడుతూ పరీక్ష సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని దీనికి పిల్లల తల్లిదండ్రులు సహకారం ఎంతో ముఖ్యమని, నైపుణ్యం పెంచుకొని, ఉపాధ్యాయుల సహకారం తీసుకొని మంచి ప్రణాళికతో ముందుకు సాగుతూ ప్రతిభ కనబరిస్తే విజయం మీ సొంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్,తీగల శ్రీధర్ మరియు పాఠశాల హెడ్ మాస్టర్ శోభన్ రావు సిబ్బంది సత్యమూర్తి, సత్యనారాయణ,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.