Listen to this article

జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి కొవ్వొత్తులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముక్కెర ముఖేష్ మాదిగ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని అమరవీరుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహరాపూర్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య మాజీ ఎంపీటీసీ కొమ్ముల సదానందం గడిపే విజయ్ మారపెల్లి చిరంజీవి మామిడి తిరుపతి మామిడి విజయ్ మారపల్లి మోహన్ సాంబయ్య రాజు వంశీ కరుణాకర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు…..