Listen to this article

జనం న్యూస్ మార్చ్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బండపోతుగల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమం లో వర్షిత హెడ్మాస్టర్ గా,అబ్దుల్ రెహమాన్ కాంప్లెక్స్ హెచ్ఎమ్ గా,షాఫియా ఎంఈఓ గా, సాత్విక్ డిఈఓ గా మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ సబ్జెక్టులను చక్కగా బోధించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మేరీకృప, ఉపాధ్యాయులు మహేష్ కుమార్ పాల్గొన్నారు.