Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 2 సెల్ 9550978955

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నేడు ఆర్డీవో సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో తనిఖీలు

చిలకలూరిపేట: దీపావళి పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిలకలూరిపేట మండలం పాత జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పసుమర్రు, బొప్పిడి పరిధిలోని బాణసంచా దుకాణాలను అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అడిషనల్ ఎస్పీ నిరంజన్, నరసరావుపేట డిఎస్పి హనుమంతరావు సంయుక్తంగా తనిఖీ చేశారు.నిబంధనల అమలుపై పోలీసులు
తనిఖీల్లో భాగంగా అధికారులు దుకాణాల్లోని నిల్వలను, అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు, ఆర్టీవో సిబ్బందితో కలిసి పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. అనుమతి పొందిన దానికంటే ఎక్కువ సరుకు నిల్వ ఉంచినా, భద్రతా నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. ఇటీవల కాకినాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల అసహనం
అయితే, తనిఖీల విషయంలో క్షేత్రస్థాయి అధికారుల తీరుపై స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారని, సాధారణ సమయంలో పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ విషయంలో సంబంధిత అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూతూమంత్రంగా ఫైర్ సేఫ్టీ.. పట్టణ ప్రజల డిమాండ్ చాలా దుకాణాల్లో కనీస ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేదని, ఉన్నచోట కూడా కేవలం పైపులు అమర్చి ‘తూతూమంత్రం’గా కానిచ్చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాణసంచా గోదాములను, దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అమలయ్యేలా చూడాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా కఠినంగా వ్యవహరించాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.