Listen to this article

జనం న్యూస్ మార్చి 02: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలకేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్గట్లమండల కేంద్రంలోని బీంనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్సిళ్లు, షార్పనర్లు, ఎరైసర్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దానం గంగమోహన్ మాట్లాడుతూశివచరణ్ రెడ్డి మంచి యువనాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ తో పాటు ఉన్నతమైన చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల యువజన ఉపాధ్యక్షుడు సుమన్ గౌడ్, తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద బూమేష్, ఏర్గట్లయువజన నాయకులు దండవోయినా సాగర్, గణేష్, శైలేష్, సంజీవ్, మెరుగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.