జహీరాబాద్ మార్చి 02: 03 2026 జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం
ఝరాసంగం మండలం పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల పోస్టర్ను జహీరాబాద్ డిఎస్పి సైద్ నాయక్ ఆవిష్కరించారు. మార్చి 04, 06, 08 తేదీలలో జరిగే ఈ జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిఎస్పిని ఉత్సవ కమిటీ సభ్యులు మాణిక్ పాటిల్, వెంకటేశం ఘనంగా సన్మానించి, జాతరకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ… ఆధునిక కాలంలో కూడా నాటక ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత ఫోన్లకు మాత్రమే పరిమితం కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమలోని కళా ప్రతిభను వెలికితీయాలని సూచించారు.జాతర కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి:మార్చి 04 (బుధవారం): అమ్మవారికి అభిషేకం, సాయంత్రం బోనాలు, ఎల్లమ్మ నాటకం – భాగం 1 మార్చి 06 (శుక్రవారం): నిత్య పూజలు, సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎల్లమ్మ నాటకం – భాగం 2 మార్చి 08 (ఆదివారం): ప్రత్యేక పూజలు, ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకం – భాగం 3 (ముగింపు) గత 32 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ జాతర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.



