జనం న్యూస్ మార్చ్ 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవం నిన్న రాత్రి దేవస్థానం బేడా మండపంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో ముందుగా ధ్వజారోహణం,భేరి పూజ, పాణిగ్రహణం, శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పేరూరి చిన్ని స్వామి ఆధ్వర్యంలో శైవాగమపండితులు కొత్తలంక పల్లంరాజు శర్మ, శైవాగమ ప్రవచన కిశోర బిరుదాంకితులు ఎలమంచిలి శ్రీనివాస్ శర్మ, ఏడిద నాగేంద్ర శర్మ, పూజ్యం సాయి సందీప్ శర్మ, చాడా శేష్ కుమార్,పేరూరి సాత్విక్ పండితుల ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా జరిపించారని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా దర్శించుకోవడానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి కనులారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మద్దాల నారాయణరావు పెంటకోట అనూష గణేశ్వరరావు ఎలమంచిలి బంగార్రాజు దంపతులు రాపేటి లీల నాగ సంతోష్ కొట్ర హరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని కళ్యాణం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేసామని సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి కల్యాణోత్సవానికి భూరి విరాళ దాత శ్రీ గౌరీ పిఎసిఎస్ అధ్యక్షులు కర్రి మహాలక్ష్మి నాయుడు స్వామివారికి పుష్పాలంకరణకు, కళ్యాణం పట్టు వస్త్రాలు, భక్తులకు అల్పాహార విందు మహాలక్ష్మి నాయుడు దంపతులు ఏర్పాటు చేశారని, అలాగే దేవస్థానం చైర్మన్ స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగిందని చైర్మన్ సత్యనారాయణ అన్నారు.//


