Listen to this article

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

జుక్కల్ మార్చి 3 జనం న్యూస్

_మంగళవారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు..ఈ భేటీ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో చర్చించారు..బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నందుకు గానూ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని సీఎం అభినందించారు..అదేవిధంగా ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు..