Listen to this article

జనం న్యూస్, మార్చి 03,అచ్యుతాపురం:

సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం అచ్యుతాపురం మండలం పూడిమడకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి దేముడు (42) అనే మత్స్యకారుడుతోపాటు ముగ్గురు వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలు సమయంలో సముద్రంలో వేటకు వెళుతూ అలల తాకిడి వలన చోడపల్లి దేవుడు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడటం వలన మునిగిపోయినట్లు వెంటనే పడవలో ఉన్న మత్స్యకారులు బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు దానిపై మృతుడు భార్య రమణమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు.