జనం న్యూస్ మార్చి 4 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
రంగుల పండుగ హోలీ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రాజేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పరిశుద్ధ కార్మికులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ హోలీ పండుగ అనేది చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, సమాజంలో సోదరభావం, ఐక్యత, ప్రేమాభిమానాలు మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.రంగుల్లాంటి వైవిధ్యాలు ఉన్నా మనమంతా ఒక్కటే అన్న భావనతో సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ సంతోషంగా వేడుకలను నిర్వహించారు.



