జనం న్యూస్ మార్చి 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కెపిహెచ్‌బి కాలనీ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు పవన్ నాయుడు ఆధ్వర్యంలో సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సమక్షంలో కూకట్‌పల్లి నియోజకవర్గం (అల్లాపూర్) గాయత్రి నగర్ డివిజన్ నుండి 31 మంది మహిళలు ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం లో నమోదు చేసుకొని జనసేన పార్టీలోకి అధికారికంగా చేరారు.వారికి ప్రేమకుమార్ పార్టీ కండువా కప్పి, వారిని సాదరంగా జనసేన లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రేమకుమార్ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు మరియు సమాజ సేవ పట్ల ఆయనకున్న అంకితభావం అనేక మందిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారి భాగస్వామ్యం పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని అన్నారు. జనసేన పార్టీ సామాన్య ప్రజల హక్కుల కోసం, పారదర్శక పాలన కోసం, యువత మరియు మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆయన వివరించారు. పార్టీలో చేరిన మహిళలు సమాజ సేవలో చురుకుగా పాల్గొని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కూకట్‌పల్లి జోన్ కో- ఆర్డినేటర్లు మండలి దయాకర్, కొల్లా శంకర్, మండలి అనిల్, అడక్ కమిటీ సభ్యులు అనిత గాలి,వేముల మహేష్ ,పోలేబోయిన శ్రీనివాస్, రణదీప్ , యోగేష్ , జాల రవి, తుంగల రామారావు తదితరులు పాల్గొన్నారు.



