Listen to this article

జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో ఈ రోజు జాతీయ భద్రత దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖ ఏయ్ చంద్రశేఖర్ అధ్యక్షతన లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాకారం రవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ శాఖ సిబ్బంది సేవలను ప్రశంసించారు. వ్యక్తిగత భద్రత- ప్రతి పౌరుని బాధ్యత అని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ గంగారం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.