Listen to this article

జనం న్యూస్ మార్చి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

సిరసపల్లి నుండి కొప్పాక వరకు నేషనల్ హైవే పక్కన కాలువ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా ముఖ్యంగా కొప్పాక గ్రామ ప్రజలకు వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ జామ్ ఏలేరు కాలువ వరకు నీరు నిల్వ ఉండడం వల్ల ట్రాఫిక్ తో పాటు చిన్న వాహనాలు ప్రమాదానికి గురైఆసుపత్రిపాలయ్యారని సదరు విషయంపై జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ ప్రధాన కమిషనర్ కి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ సమస్యలను వారిని తీసుకువెళ్లి చూపించడం జరిగిందని 84 వ వార్డ్ కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు కృషి ఫలితంగా రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని 84 వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలిపారు. ఈరోజు ఉదయం సిరసపల్లి గ్రామంలో కార్పొరేటర్ చినతల్లి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కాలువ పనులు మొదలు పెట్టారని, ఈ కాలువ నిర్మాణం పూర్తయితే సిరసపల్లి కొత్తూరు నరసింహారావు పేట కొప్పాక గ్రామాల నుండి ఇంటర్నల్ రోడ్డు కాలువలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అప్పుడు తుఫాన్లు భారీ వర్షాలు కురిసినప్పటికీ, ప్రజలు వినియోగించిన మురికి నీరు కాలువలో ప్రవహించడానికి అవకాశం ఉంటుందని నీలబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సిరసపల్లి సన్యాసిరావు వానపల్లి బాబురావు బోయిన మురళి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.