Listen to this article

జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు, వీవో మహిళా సమాఖ్య భవనాలు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలియజేశారు గ్రామాల్లో రహదారి సౌకర్యాల మెరుగుదల, మహిళా సంఘాల బలోపేతం విద్యార్థులకు సురక్షిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాణి చంద్ర ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి మండల పార్టీ అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి తారాపూర్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య పత్తిపాక గ్రామ మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉపసర్పంచ్ లు , గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళాలు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు….