జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రామ క్షేత్రం సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న
తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సిరిసిల్ల జిల్లా రామోజీపేటలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రామ క్షేత్రంను భక్తిశ్రద్ధలతో సందర్శించారు.ఆలయానికి చేరుకున్న మల్లన్న కి ఆలయ అర్చకులు,భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులు, కార్మికులు, యువతకు అభివృద్ధి అవకాశాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత సమాజానికి మార్గదర్శక శక్తిగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ధర్మం, నీతి మార్గంలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….


