బిచ్కుంద మార్చ్ 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నాడు సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగ జరిగింది ఈ ప్రతిష్టాపనకు కథ గావ్ మల్లికార్జున్ స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రాచరణాల మధ్య శాస్త్రీకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మునిసిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్ కౌన్సిలర్ నౌషా నాయక్ ధర్పల్లి గంగాధర్ మారుతి మరియు కాంగ్రెస్ నాయకులు సోపాన్ సార్, మఠం సంతప్ప ఉత్తం ఉపాధ్యాయులు టీ మనోహర్ భూమన్న మల్లికార్జున్ పద్మభూషణ్ దేవరావు మరియు ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు




