సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 05-03-2026
జహీరాబాద్ పట్టణం భారీగా విస్తరించడం మున్సిపాలిటీలో శివారు గ్రామాలు విలీనం కావడం పట్టణ జనాభా భారీగా పెరగడం జరిగింది, తెలంగాణ,కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణం నిత్యం బారి సంఖ్యలో వాహానాల రాకపోకలు సాగుతాయి పట్టణం అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా మారింది,పట్టణంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి మరి ముఖ్యంగా పట్టణంలో భారీగా వస్త్ర వ్యాపార సంస్థలు పెరిగాయి మరియు అన్ని రకాల ప్రయివేటు పాఠశాలలు,ఆసుపత్రులు ఏర్పాటు కావడంతో నియోజక వర్గంలోని ప్రజలే కాకుండా ప్రక్కనే గల కర్ణాటక రాష్ట్రం నుండి కూడా నిత్యం ప్రజలు వివిద అవసరాల కొరకు పట్టణానికి వస్తుంటారు,మరియు నీమ్జ్జ్ వల్ల కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుండటంతో పట్టణంలో ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు, ఇప్పటికే పట్టణ జనాభా సుమారు1,30,000 పెరిగింది, షాపింగ్ సెంటర్ లు భారీగా పెరగడం జరిగింది,ఈ విదంగా పట్టణానికి బారి సంఖ్యలో ప్రజలు రావడం మరియు వాహానాలతో నిత్యం రద్దీగా ఉంటుంది ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయింది పోలీస్ వారు ట్రాఫిక్ ను నియంత్రించలేక పోతున్నారు ఇప్పటికే గతంలో ఎన్నో మార్లు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తిసుకోలేదు పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యను గుర్తించి వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్,యస్.గోపాల్,లు పాల్గొన్నారు


