జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి ఆలయ పున ప్రతిష్ట, రాజగోపుర ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కలశ ప్రతిష్టకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తెలిపారు. నూకాంబిక అమ్మవారి పండగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ సారధ్యంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనంతరం, ఈనెల మార్చి 8న అమ్మవారి ఆలయ నూతన పునర్నిర్మాణ కలశ స్థాపన, ప్రతిష్ట మహోత్సవముల కు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైందని దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు) ధర్మకర్తలు మరియు ఆలయ సహాయ కమిషనర్ యాళ్ళశ్రీధర్ తెలియజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ్మవారి దేవాలయం పునర్ ప్రతిష్ట, పసిడి కలశాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందని తెలిపారు. సుమారు 100 అడుగుల ఎత్తులో గల రాజగోపురం నూతన శోభ తో ముస్తాబయిందన్నారు .. రాజగోపురం ప్రతిష్ట కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుగుతుందని తెలియజేశారు. దేవాలయం చుట్టూ భారీ విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం జరిగిందన్నారు , ఆలయానికి వచ్చే రోడ్లన్నీ ముస్తాబయ్యాయని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలియజేశారు. అన్ని ప్రభుత్వ సంస్థల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు, ఈ కొత్త దేవాలయం విశాలoగా నిర్మించామని క్యూ లైన్లు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పెయింటింగ్ పూర్తయిందన్నారు.. సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం భాగ్యం కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.మూడేళ్ల తర్వాత అమ్మవారి మూలవిరాట్ కు పూజలు నిర్వహించి, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండిభక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మధ్య ఈనెల 5 తేదీ నుండి 8 తారీకు వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలియజేశారు. పురోహితులు రేజేటి రామాచార్యులు పర్యవేక్షణలో రేజేటి సీతారామాచార్యులు గోపి అప్పలాచార్యులు ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని తెలిపారు, భక్తులు పూజా సామాగ్రితో పాల్గొనవచ్చునని విజ్ఞప్తి చేశారు 5 వ తేదీన 3 గంటల నుండి పురవీధుల్లో పసిడి కలశాల ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు 6 తేదీన ఉదయం 8 గంటల నుండి వివిధ పూజా కార్యక్రమాలు హోమాలు జరుగుతాయన్నారు ఈనెల 7న ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు 8 తేదీ ఉదయం 10.58 నిమిషాలకు పసిడి కలస ప్రతిష్ట జరుగుతుందని వారు చెప్పారు, భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉన్నతాధికారులు,భక్తులు పాల్గొంటారని తెలియజేశారు..


