జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 5
తర్లుపాడు మండలం లోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఏర్పాటు చేయనున్న కందులు & శెనగలు కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని రైతులకు తెలిపారు.కందులు క్వింటాల్ రూ 8000
శెనగలు క్వింటాల్. రూ 5875 కనీస మద్దతు ధరలు ఉన్నాయి కాబట్టి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని తెలియజేశారు.ఈపంట లో నమోదు చేసుకున్న రైతులు ముఖ్యమంత్రి యాప్ ద్వారా రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోవచ్చని చెప్పారు. ఏపీ ఎఫ్ ఆర్ విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం రైతులు నమోదు చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అమలుపరచే పథకాలు అందుకోవాలంటే సొంత భూమి కలిగిన రైతులు తప్పనిసరిగా ఏపీ ఎఫ్ ఆర్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వి ఏ ఏ లు సావిత్రి, అరవింద్ , రైతులు పాల్గొన్నారు.



