జనం న్యూస్ మార్చ్ 5 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
తిమ్మాపూర్ గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ కు సర్పంచ్ ముప్పు మానస మహేందర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 19.90 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఈ కాంపౌండ్ వాల్ పనులను ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముప్పు మానస మహేందర్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టి పి సి సి మెంబర్ అశోక్ రెడ్డి, మండల నాయకులు వీరమల్ల రంజిత్ రెడ్డి ,డాక్టర్ రమేష్, హింగే శ్రీకాంత్ , ఎంఈఓ చదువుల సత్యనారాయణ, ఉప సర్పంచ్ , వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


