Listen to this article

జుక్కల్ మార్చ్ 5 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోoగ్లీ మండల మదన్ హిప్పర్గా గ్రామం లో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు ఆదేశానుసారం ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమాకాంత్ పాటిల్ గారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీమతి కళావతి గారి తో కమిటీ సభ్యులు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇందుకు లబ్ధిదారు శ్రీమతి గైక్వాడ్ హనుమబాయి ఆనందం వ్యక్తం చేస్తూ ఇందిరమ్మ రాజ్యం లో ప్రజా ప్రభుత్వానికి రుణ పడి ఉంటానని కుటుంబ సమేతంగా ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇందులో గ్రామ సెక్రటరీ శ్రీ పవన్ సర్ గారు ఉపసర్పంచ్ గైక్వాడ్ సరుబాయి , మరియు సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ పాల్గొన్నారు.