Listen to this article

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 06-03-2026 నుండి 12-06- 2026 వరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పనులపై కార్యచరణ ప్రణాళిక విడుదల చేయడం జరిగింది . ప్రణాళిక ప్రకారం గ్రామ పంచాయతీలలో గ్రామ సర్పంచ్ ,ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని 99 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేయగలరని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ఇట్టి కార్యక్రమం మన సిరికొండ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల లో నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో అందరూ ప్రజా ప్రతినిధులు మహిళలు గ్రామపంచాయతీ పాలక వర్గా సభ్యులు మరియు అధికారులు తప్పనిసరిగా పాల్గొని గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పారిశుద్ధం పైన త్రాగునీటి పైన ఆరోగ్య సమస్యల పైన విద్య పైన ఇతర ఎలాంటి సమస్య లేకుండా పనులను చేయవలసిందిగా అందరిని కోరడమైనది మరియు ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలు పూర్తి చేయలని ఎంపీడీవో మనోహర్ రెడ్డి కోరారు.