Listen to this article

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో పోస్ట్ బ్రాంచ్ ఆఫీసర్ కోడెల రమేష్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాను తీసుకోవాలని, అమ్మాయిల సంరక్షణ చదువు నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల లోపు అమ్మాయిల కోసం సుకన్య సమృద్ధి యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారని, అమ్మాయిల సంక్షేమం భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరుచుకోవాలని ఈ పథకం కోరకు గ్రామ ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎట్లా సరూప సుధాకర్ రావు, ఉప సర్పంచ్ లక్ష్మణ్ రావు, గుజ్జుల రవీందర్ జీ, కిషన్ రావు, మహేందర్ నాగేశ్వరరావు శ్రీనివాస్ రాజేందర్ నిరంజన్ రావు శంకర్రావు, విమల, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.