జనం న్యూస్, మార్చి 6 తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి
దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ అధికారుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పాల్గొని కాలనీవాసులకు దోమల నిర్మూలనకు సంబంధించిన జాగ్రత్తలపై వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడడం, ఇంటి చుట్టుపక్కల చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నియంత్రణ సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలనీవాసులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని దోమల నిర్మూలనపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారంతో శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామచంద్ర రావు, కమిటీ సభ్యులు జి. ప్రసాద్, ఎన్. మూర్తి, టైగర్ పురుషోత్తం, సూర్యనారాయణ, కిషోర్, సునీత, సునీల్ పటేల్, నరేందర్ రెడ్డి, శీను, నాని, చల్లారావు, అంజి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి కాలనీ అధ్యక్షుడు, కార్యదర్శి మరియు కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కాలనీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజా కార్యక్రమాలను ముందుండి విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రశంసలు తెలిపారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులు, కమిటీ సభ్యులకు అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మరియు కార్యదర్శి రామచంద్ర రావు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.



