Listen to this article

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలోని 2వ వార్డ్ లో మండల పరిషత్ 2022- 23 మంజూరైన 1,30,000 రూపాయల నిధులతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన గ్రామ సర్పంచ్ చింతల ఉమా – రవిపాల్ ప్రారంభించారు. డ్రైనేజీ నిర్మాణంతోపాటు, గ్రామ అభివృద్ధి ఏజెండాగా వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్, వార్డు సభ్యులు కోల సుజాత తదితరులు పాల్గొన్నారు.