జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955
11 నెలల తర్వాత ఆసుపత్రికి వచ్చిన ‘చిన్నారి అతిథి’..
చిలకలూరిపేట: వైద్యుడికి, రోగికి మధ్య ఉండే బంధం కేవలం చికిత్సకే పరిమితం కాదని, అది అనురాగంతో కూడుకున్నదని లీలావతి హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ మరోసారి నిరూపించారు.సుమారు 11 నెలల క్రితం లీలావతి హాస్పిటల్స్‌లో డాక్టర్ సుష్మ పర్యవేక్షణలో ఒక చిన్నారి జన్మించాడు. ఆ బాబు ఆరోగ్యంగా ఎదిగి, దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో తల్లిదండ్రులు ఆ చిన్నారిని తీసుకుని డాక్టర్ సుష్మను కలిసేందుకు ఆమె ఛాంబర్‌కు వచ్చారు. తన చేతుల మీదుగా పుట్టిన ఆ ‘చిన్నారి సందర్శకుడిని’ చూడగానే డాక్టర్ సుష్మ ఎంతో మురిసిపోయారు. ఎంతో వాత్సల్యంతో ఆ బాబును ఎత్తుకుని, ముద్దాడి తన సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మా వద్దకు ఒక అందమైన చిన్న సందర్శకుడు వచ్చాడు. 11 నెలల క్రితం మా లీలావతి హాస్పిటల్స్‌లో పుట్టిన ఈ బాబును మళ్ళీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది,” అని భావోద్వేగానికి లోనయ్యారు. ఒక వైద్యురాలిగా తాను అందించిన సేవలకు ప్రతిఫలంగా ఆ పసికందు చిరునవ్వును చూడటం కన్నా గొప్ప సంతృప్తి ఏముంటుందని ఆమె పేర్కొన్నారు.


