

జనం న్యూస్ ఫిబ్రవరి 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి పట్టణం గవరపాలెం మున్సిపల్ చిన్న హైస్కూల్ లో 1993-94 ఎస్ ఎస్ సి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఉత్సాహంగా జరిగింది.గవర్ల అనకాపల్లి నుండి తోటాడ మీదుగా కాకరాపల్లి వెళ్లే దారిలో రోడ్డుకు ఎడమవైపు గల బుద్ద సన్నప్పరావు తోటలో పూర్వ విద్యార్థులందరూ ఆనందంగా గడిపారు. ముందుగా అక్కడికి సమీపంలో గల పురాతన అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం కొంతసేపు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరినొక యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కుశల ప్రశ్నలను వేసుకున్నారు.3 దశాబ్దాల క్రితం విద్యాభ్యాసంనాటి తీపిగుతులను నెమరు వేసుకున్నారు.వివిధ ప్రాంతాల్లో వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా స్థిరపడ్డ వారందరూ తమ పాత మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడిపారు.కాండ్రేగులరామలింగేశ్వరరావు (రాంబాబు) కోయిలాడ పరమేశ్,చాన్ బాషా, పెంటకోట పూర్ణచంద్రరావు, బొగేస్,ఆళ్లశివాజీ, జగన్నాధరావు, మాదేటి శ్రీను,దాడి సతీష్ ,చక్రవర్తిగణేష్, రాజు, భాస్కర్, చక్రవర్తి తదితరుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలోసుమారు 90 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.//