జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతా ఊహించినట్లుగానే గ్యాస్ ధరల మంట ప్రారంభమైంది.హార్ముజ్ జలసంధి నుంచి ఎల్బీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచేసింది. ఇవాళ్టి నుంచి ఇళ్లకు వాడే సిలెండర్లతో పాటు వాణిజ్య సిలెండర్లపైనా భారీగా రేట్లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహోపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అదేవిధంగా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.115 పెరిగింది. దీని ప్రభావం హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడబోతోంది. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913 కు పెరిగింది. ముంబైలో కొత్త రేటు ఇప్పుడు రూ.852.50గా ఉంది. కోల్‌కతాలో ధర రూ.879 నుండి రూ.030 కు పెరిగింది. చెన్నైలో ఇది రూ.868.50 నుండి రూ.928.50 కు పెరిగింది.మరోవైపు ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1768.50 నుండి రూ.1883కి పెరిగింది. ముంబైలో కమర్షియల్ సిలెండర్ ధర రూ.1720.50 నుండి రూ.1835కి పెరిగింది. అలాగే కోల్‌కతాలో ధర రూ.1875.50 నుండి రూ.1990కి పెరిగింది, చెన్నైలో ఇది రూ.1929 నుండి రూ.2043.50కి పెరిగింది. వాస్తవానికి గ్యాస్ సిలెండర్ ధరలు గతేడాది ఏప్రిల్ నుంచి మారలేదు. ఇరాన్ వార్ నేపథ్యంలో భారతదేశ ఇంధన సరఫరా, ఇంధన లభ్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పెంపు అమల్లో వచ్చిది. దీంతో దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరాలో అంతరాయాల గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో చెప్పిన మాటలు నిజం కాదని తేలిపోయింది….


