Listen to this article

జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈ రోజు గద్వాల పట్టణంలోని జమ్ములమ్మ దగ్గర సునీత ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో హాల్ నంబర్-1లో గద్వాల మండలం,హల్ నంబర్-2 లో మల్దకల్ మండలం ప్రశిక్షణ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జ్ బాపు రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ బాపురెడ్డి మాట్లాడుతూ.మహాభియాన్ యొక్క లక్ష్యం, ప్రశిక్షణ విధానం మరియు కార్యకర్తల పాత్ర మరియు పలు అంశాలపై ప్రసంగించడం జరిగింది. ప్రశిక్షణ యొక్క ఉద్దేశ్యం, ప్రశిక్షణ నమూనా, విషయ సూచిక, కార్యకర్తలకు అవసరమైన ఆలోచనా దృక్పథం, సంస్థ పట్ల నిబద్ధత, మరియు సమాజ సేవలో కార్యకర్తల బాధ్యతలు వివరించారూ.ఈ ప్రశిక్షణ కార్యకర్తలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు జాతీయతా భావాన్ని పెంపొందించే ఒక శక్తివంతమైన సాధనం. వ్యక్తి నిర్మాణం ద్వారానే సంస్థ బలోపేతం సాధ్యమవుతుంది, సంస్థ బలోపేతం ద్వారానే దేశ నిర్మాణం సాధ్యమవుతుంది అనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త యొక్క ముఖ్య బాధ్యత. దేశభక్తి, సేవా భావం, మరియు సిద్ధాంతాల పట్ల అంకితభావంతో ప్రతి కార్యకర్త సమాజంలో మార్పుకు దారితీసే నాయకుడిగా ఎదిగి, సంస్థను మరింత బలోపేతం చేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ఎక్బోటే, ప్రశిక్షణ జిల్లా కన్వీనర్ శ్యామ్ రావ్, కో కన్వీనర్ గాంజా సాయి, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, తిరుపతిరెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు..