సర్పంచ్ శ్వేత కృష్ణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత,
జనం న్యూస్,కంగ్టి, మార్చ్ 07,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గణపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో శనివారం గ్రామ సర్పంచ్ శ్వేత కృష్ణ, ఐసిడిఎస్ సుప్రవైజర్ సుజాత,తో అంగన్వాడి టీచర్ పార్వతి, సంతోషి,ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు విద్యతోపాటు పౌష్టిక ఆహారం,బాలింతలకు పౌష్టిక ఆహారంతో పాటు,తమ ఇంటి ఆడపడుచుగా చీర సారెలు పెట్టి శ్రీమంతం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.కొన్ని కుటుంబాలలో దయనీయమైన స్థితిగతుల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలలో శ్రీమంతం నిర్వహించే ఆస్కారం ఉండకపోవచ్చు అని అన్నారు.అటువంటి వారికి ఏమాత్రం బాధ కలగకుండా ప్రభుత్వమే అంగన్వాడి కేంద్రంలో శ్రీమంత కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు.గ్రామంలోని ప్రతి ఒక్కరు గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాలలో తమ పేరును నమోదు చేసుకొని పౌష్టిక ఆహారాన్ని ఆరోగ్య సూచనలను సలహాలను, పాటించాలని గర్భిణీలకు తెలియపరిచారు.ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడి కేంద్రాలలో చేర్పించాలని చిన్నారుల సంరక్షకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా కవిత,పోచవ్వ,ఆశా వర్కర్ శకుంతల, గర్భిణీలు,బాలింతలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.


