Listen to this article

జనం న్యూస్ మార్చి 7 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండల కేంద్రంలో మార్చి 14న నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు గురించి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 134 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రంలో సౌకర్యాలైన విద్యుత్ తాగునీటి వసతి శౌ చాలా యాలు గూర్చి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులతో చర్చించడం జరిగింది మండల విద్యాధికారి మరియు మండల తాసిల్దారు చిలిపి చెడు పదోతరగతి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది వారు విద్యార్థులకు తగు సూచనలు చేయడం జరిగింది మొదటి రోజు పరీక్షకు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలియజేయడం జరిగింది విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా ఇలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని స్మార్ట్ వాచీలు గాని తీసుకొని పరీక్ష కేంద్రానికి రావద్దు అని తెలియజేయడం జరిగింది ఈ పరీక్ష సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఉదయం పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకుని రావాలని తెలియజేయడం జరిగింది విద్యార్థులు రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేచి పరీక్షకు సంసిద్ధులు కావాలని మరియు విద్యార్థులు కచ్చితంగా పరీక్షకు వచ్చే ముందు హాల్ టికెట్స్ ను తీసుకొని పరీక్ష కేంద్రానికి రావాలని సూచించడం జరిగింది. హాల్ టికెట్స్ లేనిచో పరీక్షా కేంద్రంలోకి అనుమతించారని చెప్పడం జరిగింది విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నాపత్రంలో ప్రతి పేజీకి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు పరీక్షలను ఒక పండుగ వాతావరణంలో రాయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సహదేవ్ మరియు ఆర్ ఐ సునీల్ చౌహాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనమూర్తి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు