Listen to this article

జుక్కల్ మార్చ్ 7 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు డి సి హెచ్ ఎస్( DCHS) తో కలిసి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి, అందులో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలు, పరికరాలు మరియు రోగులకు అందించే సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పిట్లం మరియు చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఈ నెల చివరి వారంలో గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు..
ఆసుపత్రి ప్రారంభం అయిన తరువాత మండలంలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.అలాగే ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు..