Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955

ఎన్టీఆర్ జిల్లాలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మితిమీరిన ప్రవర్తన, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తల్లిదండ్రులతోను, ఉపాధ్యాయులతోను చర్చించి సరైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చోద్యం చూస్తూ ఉన్నట్లయితే ఒక తరాన్ని ఈ సమాజం నష్టపోయే అవకాశం ఉంది అని అన్నారు. గత కొంత కాలం నుండి వస్తున్న సినిమాలు, ఉపాధ్యాయులను కించపరిచే విధంగా, వారి గౌరవాన్ని తగ్గించే విధంగా కామెడీ పాత్రలను రూపొందించడం కూడా ఇందుకు కారణం అని అన్నారు. గతంలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని దండిస్తే తల్లిదండ్రులతో చెప్పుకోడానికి సంశయించే వారిని, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయి అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రతి చిన్న దానికి స్కూల్లో పై వెళ్లడం సరైన విధానం కాదు అని అన్నారు. ఇందువల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా సరైన విధానాలను రూపొందించాలని భాను ప్రసాద్ కోరారు.