

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం: మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా విడిచి పెట్టకుండా ఆయా గ్రామాలలో ఉన్న దివ్యాంగులను, మానసిక వికలాంగులైన బాలబాలికలను గుర్తించి ఆ వివరాలను ఏ రోజుకారోజు మండల న్యాయ సేవా సంఘంకు అందించాలని మండల న్యాయసేవాసంఘం అద్యక్షరాలు, జూనియర్ సివిల్ జడ్జి బీఎంఆర్. ప్రసన్నలత సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు రెండు వారాలపాటు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, జలుమూరు మండలాల్లో గల అన్ని గ్రామాలలో విభిన్న ప్రతిభావంతులు, మానసిక రుగ్మతలు కలిగిన బాలబాలికలను గుర్తించి వారికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, ఏమైనా సహాయ సహకారాలు అవసరమా అనే విషయంపై రెండు వారల పాటు డోర్ టు డోర్ క్యాంపైన్లు అనగా ఇంటింటికీ కూడా సేవలో కార్యక్రమములు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మూడు టీములుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు