Listen to this article

జనం న్యూస్ జనవరి 10 అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు వాహనాలను శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి SI ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు పశువులతో వెళ్తున్న రెండు బులేరో వాహనాలను వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్లో విక్రయించేందుకు 25 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.