Listen to this article

పెన్షన్ పెంపు కోసం మార్చి 13 న నిరాహార దీక్షలు

ఛలో హైదరాబాద్కు వికలాంగులంతా తరలిరావాలి

NPRD జిల్లా కార్యదర్శి కొనింటి నర్సిములు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 09. 03. 2026

వికలాంగుల పెన్షన్తో పాటు చేయూత పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 13 న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కొనింటి నర్సిములు తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న పెన్షన్స్ పెంచడం లేదు. 2023 డిసెంబర్ నుండే పెన్షన్ పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హామీని అమలు చేయకుండా వికలాంగులను మోసం చేశారు.బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తుంది. కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 26 నెలల నుండి చేయూత లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ పెంచుతు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, బడ్జెట్ పెంపు కోసం మార్చి 13 న ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షలో జిల్లాలోని వికలాంగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.