Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్

08-03-2026 ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు కార్యాలయంలో మహిళలతో కలిసి కేక్ ను కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో వై.నరోత్తం గారు మాట్లాడుతూ మహిళ కుటుంబానికి పునాది, సమాజానికి శక్తి.ఒక మహిళను గౌరవించడం అంటే ఒక కుటుంబాన్ని,ఒక సమాజాన్ని గౌరవించడం.విద్య,ఉద్యోగాలు,వ్యాపారం,రాజకీయాలు వంటి ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.మహిళలకు గౌరవం, భద్రత,సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామి దాస్,యస్.గోపాల్, జి.క్రిష్ణ,రాంశెట్టి,చెంగల్ జైపాల్,బి.విఠల్,యస్. శ్రీనివాస్,పెంటన్న,గఫార్, పవన్ రాథోడ్,మితున్ రాథోడ్,మెఘనాథ్, మహిళలు లక్ష్మీ,అనసుజా, పర్వీన్ బేగం,మానెమ్మ, ఆశాలత,పుష్పంమ,సుజాత,తదితరులు ఉన్నారు