ప్రారంభించిన నందికొండ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్
జనం న్యూస్-మార్చి 9- నాగార్జునసాగర్ టౌన్-
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో సోమవారం ఉదయం 7 గంటలకు నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హిల్ కాలనీ మెయిన్ బజార్ వరకు నందికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, చైర్ పర్సన్ స్వర్ణ మానస సుమన్ జెండా ఊపి 5కే రన్ ను ప్రారంభించారు. అనంతరం హిల్ కాలనీ మెయిన్ బజార్ లో మానవహారం చేశారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చైర్ పర్సన్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పారిశుద్ధ్యన్ని పెంపొందించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నామని 99 రోజులు పాటు ఈ ప్రత్యేక కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస సుమన్, కౌన్సిలర్ లు, మున్సిపల్ సిబ్బంది ,పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక యువతి యువకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


