జనం న్యూస్ మార్చ్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కామారెడ్డి జిల్లా కేంద్రంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, బీబీపేట సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ అధ్యక్షులు (కొంగరి) ఎం. నాంపల్లి ని, కామారెడ్డి జిల్లా అడ్వైజర్ గా నియమిస్తున్నట్లు, తెలంగాణ (ఆర్టిఐ ) రాష్ట్ర డైరెక్టర్, ఎం. ఏ.సలీం, ప్రకటించారు. బీబీపేట ఆర్టిఐ అధ్యక్షులు నాంపల్లి, సమాజానికి చేస్తున్నటువంటి నిస్వార్థ సేవను గుర్తించి, రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. అంతేకాకుండా, సహ చట్ట, అవగాహన సదస్సులతోపాటు,ఆన్లైన్ మోసాల పట్ల, బాల కార్మిక నిర్మూలన పై, విద్యాహక్కు చట్టంపై, మూఢనమ్మకాలపై, రాజ్యాంగపరమైనటువంటి, అనేక చట్టాల గూర్చి, అవగాహన కార్యక్రమాల నిర్వహించి, ప్రజలను జాగ్రత్తపరచినందుకు, ఆర్టిఐ రాష్ట్ర కమిటీ వీరిని ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ, తమపై పూర్తి విశ్వాసంతో, జిల్లా అడ్వైజర్ గా నియమించినందుకు, రాష్ట్ర కమిటీకి, అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఆర్టిఐ కార్యవర్గాన్ని నియమించి, (ఆర్.టి.ఐ) చట్టం యొక్క ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను జాగృతం చేసి, ప్రతి ఒక్కరికి చట్టాల ప్రాధాన్యతను తెలియపరుస్తామని, వారన్నారు. ఇట్టి కార్యక్రమంలో, రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఎ.సలీం. మహిళా అడ్వకేట్లు, (ఏ జి పి )షబానా బేగం. లతా రెడ్డి, కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.


